సెకండ్ ఎఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం
మహబూబాబాద్, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలు నుండి నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కి మరియు వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షురాలు దార్ల జ్యోతి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ పని చేస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు,అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు,వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు,హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష లేకుండ యధావిధిగా రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.కానీ ఈ కమిటీ ఇప్పటి వరకు సమావేశం కాలేదనీ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ పరీక్ష రాసే వయసులో సెకండ్ ఏఎన్ఎంలు లేరని ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ప్రతి ఆరోగ్య కార్యకర్తలు వెంటనే ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కమిటీ రిపోర్ట్ లేకుండానే 2024 డిసెంబర్ 29 వ తేదీన రాత పరీక్ష పెట్టటం వలన anm లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి ఏటివంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్టు anm లను యాదవిధిగా రెగ్యులర్ చేయాలనీ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసినారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగికి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు లేనివిధంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నాయి ఏఎన్ఎం లకు పని భారం ఎక్కువగా ఉందని దీనివల్ల అనారోగ్యంతో పాటు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తున్నారని తెలిపారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి ఇంటర్ నెట్ రాక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నాసిమా బేగం, పార్వతి, వనిలా, సుమా, సమ్మక్క సువర్ణ, వనిత తదితరులు పాల్గొన్నారు.