Sports & Games

Breaking News

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

- వైద్య ఆరోగ్యశాఖ సంఘాల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ నవీన్ కుమార్ 
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్తో  పాటు వివిధ పథకాల కింద పనిచేస్తున్న ఏఎన్ఎం లందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సంఘాల పోరాట కమిటీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ నవీన్ అన్నారు. సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం ఫిర్యాదుల విభాగంలో మేమరాండం అందజేశారు.ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ S నవీన్ కుమార్ మాట్లాడుతు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు,అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు,వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు,హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష లేకుండ యధావిధిగా రెగ్యులర్  చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. గతంలో సమ్మె సందర్బంగా anm న్యాయమైన సమస్యల పరిష్కారానికి తేదీ 2.9.2024 రోజున ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.కానీ ఈ కమిటీ ఇప్పటి వరకు సమావేశం కాలేదనీ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు కానీ పరీక్ష రాసే వయసులో సెకండ్ ఏఎన్ఎంలు లేరని ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ప్రతి ఆరోగ్య కార్యకర్తలు వెంటనే ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కమిటీ రిపోర్ట్ లేకుండానే 2024 డిసెంబర్ 29 వ తేదీన రాత పరీక్ష పెట్టటం వలన anm లు తీవ్ర ఆందోళనలో  ఉన్నారు.వెంటనే ప్రభుత్వం ఇచ్చిన  హామీని అమలు చేసి ఏటివంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్టు anm లను యాదవిధిగా రెగ్యులర్ చేయాలనీ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ గా డిమాండ్ చేసినారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగికి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు లేనివిధంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నాయి ఏఎన్ఎం లకు పని భారం ఎక్కువగా ఉందని దీనివల్ల అనారోగ్యంతో పాటు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తున్నారని తెలిపారు గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిల ఆరోగ్య సిబ్బందికి ఇంటర్ నెట్ రాక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పుష్పల,ఆనందాబాయ్, తులసి, సంగీత, జ్యోతి, విజయలక్ష్మి,మమతా, రమాదేవి, అశ్విని 
మోదైలన వారు పాల్గొన్నారు.