తెలంగాణలోని రెండవ లను రెగ్యులర్ చేయాలని ఎన్ హెచ్ ఎం జాతీయ ప్రభుత్వ డైరెక్టర్ డాక్టర్ సూరజ్ కుమార్ కి వినతిపత్రం
న్యూఢిల్లీ (ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్లో గత 20 సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పథకాలను ప్రజలకు అందించడం తోపాటు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న సెకండ్ ఏ ఎన్ ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని తెలంగాణ సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ అధ్యక్షురాలు మమత ప్రధాన కార్యదర్శి అనురాధ ల ఆధ్వర్యంలో జాతీయ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ సూరజ్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ సూరజ్ కుమార్ తెలంగాణ సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ అధ్యక్షులు మమత ప్రధాన కార్యదర్శి అనురాధలకు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ అధ్యక్షులు మమత ప్రధాన కార్యదర్శి అనురాధలు మాట్లాడుతూ మాత మరియు శిష్యు ఆరోగ్య సేవలు కేబుల్ డిసీస్ కంట్రోల్ ప్రోగ్రాములు జాతీయ టిబి ,ఎయిడ్స్, ఎమునైజేషన్ కార్యక్రమాలు ఆసుపత్రుల్లో ప్రసూతి తోపాటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని డైరెక్టర్ కు వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 1500 పైగా ఏఎన్ఎం పోస్టులు కోసం పరీక్ష పెట్టిందని ఇందులో 4 వేల మందికిపైగా సెకండ్ ఏ ఎన్ ఎమ్ లు ఉన్నారని ఇటీవల చదువులు పూర్తి చేసుకున్న చాలామంది పరీక్షలు రాస్తున్నారని అయితే సెకండ్ ఏ ఎన్ ఎం లకు మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెంటనే మీరు స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను డైరెక్ట్ గా రెగ్యులర్ చేయాలని విన్నవించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సెకండ్ ఏ ఎన్ఎంలో చాలామంది పదవి విరమణ వయసులో ఉన్నారని మెజార్టీ ఎక్కువగా ఉండటం గమనార్వమని తెలిపారు. రోజురోజుకు పని భారం పెరగడం వల్ల సెకండ్ ఏఎన్ఎం లో చాలామంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని డైరెక్టర్ కి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 42 రికార్డుల తో పాటు రోజువారి కార్యక్రమాలు సభలు సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మానసికంగా ఎంతో కృంగిపోతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి తెలంగాణలోని నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డైరెక్టర్ కి విన్నవించారు. 15- 20 సంవత్సరాల నుంచి నేషనల్ హెల్త్ మిషన్ పథకానికి అంకిత భావంతో పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గణనీయంగా విజయవంతం చేసినరని ఈ సందర్భంగా డైరెక్టర్కు సూచించారు. దేశంలోని మణిపూర్ ఒడిశా తమిళనాడు ప్రభుత్వాలు తమ నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ఇప్పటికి ప్రశాంతనీయమైన చర్యలు చేపట్టడం జరిగిందని డైరెక్టర్కు తెలిపారు అదే రీతిలో కూడా తెలంగాణలో కూడా సెకండ్ ఏఎన్ఎం నుండి రెగ్యులర్ చేయాలని వారు కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ సూరజ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్టు తెలంగాణ సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మమత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అను రాధా లు పేర్కొన్నారు.