ప్రభుత్వ ఆసుపత్రులలో 100 శాతం ప్రసవలు జరిగేలా చూడాలి
- రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ముందు ఉండాలి
- సమయపాలన పాటిస్తూ సరిగా విధులు నిర్వహించండి
- వైద్య సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు
- ప్రజలకు వైద్యం ఆరోగ్య పథకాలు అందించడంలో ముందుండాలి
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100% ప్రసవలు జరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు గర్భిణీ స్త్రీలను ప్రైవేటు ఆసుపత్రులకు పంపించకుండా స్థానిక ఆసుపత్రిలోని జరిగే ల చర్యలు తీసుకోవాలన్నారు ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీలను రిజిస్ట్రేషన్ చేయించి వారిని పౌష్టికాహారం అందించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు అందుబాటులో లేనట్లయితే ఆసుపత్రిలో గర్భిణీ మహిళను ఎవరు పరీక్షిస్తారని అందుకు ప్రతి ఆసుపత్రిలో వైద్యాధికారులు ఉండాలని సూచించారు. అవసరమైతే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సహాయ సహకారాలు కూడా తీసుకోవాలన్నారు. ఆరోగ్య పాఠశాల పై ప్రతి ఒక్కరు దృష్టి సాధించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని తెలిపారు సమయపాలన పాటు సరైన రీతులో వైద్యులు వైద్యాధికారి లో మెడికల్ పడమటికల్ సిబ్బంది అందుబాటు ఉండి వైద్య సేవలు అందించాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుండాలని తెలిపారు. టిబి ఎం సి హెచ్ లపై కూడా వెధవయించాలని తెలిపారు ప్రతి వారం వారం గ్రామాల్లో నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. టీ హబ్ పంపే వైద్య పరీక్షల ను వైద్యులు రిపోర్ట్ అచ్చిన తర్వాత పరిశీలించి సరైన రీతిలో వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. నామమాత్రంగా టీ హబుల్లో కు రక్త పరీక్షలు పంపి రిపోర్ట్స్ రోగులకు అప్పచెప్పి చికిత్సలు అందించకుండా ఉండొద్దని వైద్యాధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వైద్యులు అందుబాటులో ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆరోగ్యపతకాలను ప్రజలు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర వహించాలని తెలిపారు. అంతేకాకుండా ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని రకాల వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయించాలని లేనిపక్షంలో టీ హబ్ కి పంపించి మరుసటి రోజు చికిత్సలు అందించాలని లేనిపక్షంలో దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రిపేర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండి చికిత్సలు అందించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు 102 ఒక 108 వాహనాలపై కూడా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించు సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. పీఎం జన్మన్ యోజన పై కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన ల ఆరోగ్యం కొరకు కేంద్ర ప్రభుత్వం పీఎం జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిం ఇస్తున్నారని కలెక్టర్ పేరుకున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లలో సరైన సమయానికి వెళ్లి విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్,రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా టిబి నివారణ అధికారి డాక్టర్ సుమలత, జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్ తదితరులు పాల్గొన్నారు.



