డిసెంబర్ 10న ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌ న్సిల్ పీపుల్స్ సమావేశం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- రెండు రాష్ట్రాల్లో 5000 మందికిపైగా సభ్యులు
- త్వరలో అన్ని జిల్లాలు మండలాల కమిటీలు
- మహిళా సమస్యలపై నిరంతరం పోరాటం
- ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ చైర్పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ పనిచేస్తుందనీ నేషనల్ ఉమెన్ రైట్స్ చైర్పర్సన్ డాక్టర్ జ్ఞానసుందరి తెలిపారు. డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో రెండు రాష్ట్రాల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగిందని కొన్ని జిల్లాల్లో వేయవలసి ఉందని అలాగే అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి మహిళల సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. వరకట్న వేధింపులు అత్యాచారం ఆత్మహత్యలు మహిళా సమస్యలు పై పోలీస్ స్టేషను కోటుకు వెళ్లకుండా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తూ సమస్యను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే తామేవెంట ఉండి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కాని కౌన్సిలింగ్ ఇప్పించి ఆ కుటుంబాన్ని ఒకటి చేసే బాధ్యత మాపై ఉందని తెలిపారు. ఇందుకుగాను ఇప్పటివరకు పోలీస్ శాఖ న్యాయవాదులు ప్రజలు అందరు సాయ సహకారాలు అందించారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 10న విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 5000 మంది నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా సమస్యలనుపరిష్కరించేందుకు ఇప్పటివరకు అనేక రకాల కార్యక్రమాలు చేశామని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆమె పేర్కొన్నారు.