Sports & Games

Breaking News

అన్నదమ్ముల వలె బ్రతికే వారిపై కులాల కుంపటి ఎందుకు?...

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

- నేషనల్ వుమన్ రైట్స్ చైర్ పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి 
సమాజంలో అందరూ అన్నదమ్ముల అనుకుని బ్రతుకుతున్నారని వీరి మధ్య కులాల కుంపటి ఎందుకని నేషనల్ ఉమారాయుడు చైర్పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి అన్నారు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్గీకరణ అనే అంశం లేవనెత్తుతూ అన్నదమ్ముల మధ్య కుమ్ములాట పెట్టిన రాజకీయాల కుల నాయకులను నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు. ఏ కులమైన ఏ మతమైనా అందరిని ఒకే రకంగా చూడాలని కానీ కులాలు పేరుతో విభజించడం సరైనది కాదన్నారు. సొంత లాభాల కొరకు కులాల మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవసరమైతే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా వెనుకబడిన పేదరికంలో ఉన్న వారిని అన్ని రకాల ఆదుకోవాలని ఆమె కోరారు. అంబేద్కర్ ఆశల కొరకు ప్రతి ఒక్కరు పని చేయాలని తెలిపారు.