మహారాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- మహారాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం:ఆత్రం సుగుణక్క, బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
- బీజేపీ కూటమి మోసాలను నమ్మకండి..'అర్ని' నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో:ఆత్రం సుగుణక్క*
ఆదిలాబాద్: మహారాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపర్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆదివారం యవత్మాల్ జిల్లా 'అర్ని' నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జితేందర్ శివాజీ రావు మోగేకు మద్దతుగా ఆదివాసీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ బీజేపీ నాయకుల మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దని అక్కడి ప్రజలను కోరారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని,ఇక్కడ కూడా కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతు తెలిపాలని అన్నారు.కాంగ్రెస్ సర్కార్ మహారాష్ట్రలో రావడం ఖాయమని స్పష్టం చేశారు..ఈ ప్రచారంలో సునీల్ జాదవ్,నారాయణ షిండే, గాటంజి బ్లాక్ ప్రెసిడెంట్ సహా దేవ్ రాథోడ్,మాజీ సర్పంచ్ గొట్టి ప్రమోద్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.