మందులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా ఉంచాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్
అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): మందుల నిరువలకు సంబంధించిన అన్ని రికార్డ్స్ సక్రమంగా ఉంచడంతోపాటు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందపరచాలని టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ సిబ్బందిని హెచ్చరించారు. టార్కు ఫోర్ తనిఖీల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఫైర్ తో పాటు రిమ్స్ ఔషధ కేంద్రం తోపాటు కళాశాలలోని కొన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రి అనుబంధంగా ఉన్న ఔషధ కేంద్రంలో రికార్డ్స్ సక్రమంగా లేకపోవడం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ రికార్డ్ సరిగా లేకపోవడం ఆఫ్లైన్లో కూడా రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంతో ఎందుకు రాయలేదని అడిగి తెలుసుకున్నారు. ఇకనుంచైనా రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే సీనియర్ల సహాయ సహకారాలు తీసుకొని రికార్డులు రోజువారిగా నమోదు చేయాలని తెలిపారు. అంతేకాకుండా కొన్ని రకాల సలహాలు సూచనలు కూడా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ సిబ్బందికి తెలిపారు. అంతకుముందు రిమ్స్ ఆస్పత్రిలోని ఫైర్ విభాగం కి సంబంధించిన అన్నింటిని పరిశీలించారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ తో పాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్ ఎం ఓలు డాక్టర్ చందు, డాక్టర్ సాయి ప్రసూన్ జిల్లా గణాంకాల అధికారి బ్రహ్మానందం రెడ్డి, ఫార్మసిస్టులు హకీం, శ్రీకాంత్, దినేష్, చింతామణి, వరలక్ష్మి, శివాజీ , హరి కేతన్, రాజేందర్ జావిద్ తోపాటు తదితరులు ఉన్నారు.