Sports & Games

Breaking News

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 984802451 

- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. మంగళవారం రోజు ఆయన స్థానిక త్రినేత్ర ఎస్సీ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ సెంటర్లలో రికార్డులను పరిశీలించడంతోపాటు స్కానింగ్ వివరాలు ఆన్లైన్ నమోదు చేయడంపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు అనే బోర్డులను ఏర్పాటు చేయాలి అని దీనితో పాటు స్కానింగ్ ధర్లపట్టిక ను కూడా వెయిటింగ్ రూమ్లలో పాటు అన్ని గదులు ఏర్పాటు చేయాలని ఆయన యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు డయాగ్నస్టిక్ సెంటర్లో ఆయుష్ ఆసుపత్రులు ఐస్ క్రీం కలర్ తనిఖీల కోసం జిల్లా వ్యాప్తంగా 8 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం అన్ని సెంటర్లలో బోర్డులను ఏర్పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంట మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.