Sports & Games

Breaking News

జిల్లాలో త్వరలో వెసెక్టమీ ఆపరేషన్లు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 
- జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. వెసటమి ఆపరేషన్ పై ప్రోగ్రాం అధికారులకు వైద్య అధికారులకు సూపర్వైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో మూడు సెంటర్లలో వెసెక్టమీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోత్ సి హెచ్ సి ఆస్పత్రిలో ఉట్నూరు డిస్టిక్ ఆస్పత్రి తో పాటు ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిలో వేసెప్టమి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెసెక్టమీ ఆపరేషన్ పై పురుషులకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. టుబెట్టే మీ ఆపరేషన్ మహిళలకు చేసినట్లయితే ఏడు రోజుల పాటు వారికి అన్ని రకాల చికిత్సలు అందించటం తో పాటు రెండు మూడు నెలలు బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందని కానీ వెసెక్టమీ ఆపరేషన్ పురుషులకు చేస్తే 24 గంటల్లో వాళ్లు ఎలాంటి పని అయినా చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ పని కూలి పని బరువు లేపటం తో పాటు అన్ని రకాల పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా టిబి నివారణ అధికారి డాక్టర్ సుమలత, ఎన్ సి డి అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, జిల్లా గణాంకాల అధికారి బ్రహ్మానందం రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.