Sports & Games

Breaking News

40 వేల423 మంది నర్సింగ్ ఆఫీసర్ పరీక్షకు హాజరు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

• ప్రశాంతంగా నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్
• ఒక్కో పోస్టుకు భారీగా కాంపిటేషన్
• సెషన్ -2లో పేపర్ హార్డ్..
• సిలబస్ లోని ప్రశ్నలకంటే హాస్పిటల్స్ అనుబంధ క్వశ్చనరీ

తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నర్సింగ్ ఆఫీసర్స్ ఎగ్జామ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం 42,244 మంది దరఖాస్తు చేసుకోగా, కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన టెస్టుకు 40,423 మంది హాజరయ్యారు. 95.69 శాతం మంది అటెండ్ అయినట్లు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. 2,322 పోస్టుల భర్తీ కోసం జరిగిన ఎగ్జామ్కు ఫుల్ కాంపిటిషన్ ఉన్నది. గతంతో పోల్చితే ఈ సారి ప్రశ్నాపత్రం టఫ్గా వచ్చిందని అభ్యర్థులు చెబుతున్నారు. సెషన్ -1తో పోల్చితే సెషన్ -2 పేపర్ హార్డ్ గా ఉన్నదని, సిలబస్లోని ప్రశ్నల కంటే, హాస్పిటల్స్ అనుబంధ క్వశ్చనరీ ఎక్కువగా వచ్చిందని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక గురుకులాల్లో ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్లుగా వర్క్ చేస్తున్న వాళ్లు సైతం మళ్లీ ఎగ్జామ్ రాశారు. మంచి ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుందని ఇలా చేస్తారని అధికారులుచెబుతున్నారు. అయితే ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఆయా విభాగాల హెచ్్వడీల నుంచి ఎన్వోసీ తీసుకోవాలని, దానిని పరీక్ష కంటే ముందే బోర్డుకు సబ్మిట్ చేయాలని, కానీ చాలా మంది ఈ రూల్న పాటించలేదని మెడికల్ బోర్డు అధి కారులు ప్రాథమికంగా గుర్తించారు. నిబంధ నల ప్రకారం వీళ్ల అభ్యర్థిత్యం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇక గతంలో 317 జీవో ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లిన నర్సింగ్ ఆఫీసర్లు సైతం మళ్లీ కొత్తగా ఎగ్జామ్ రాశారు. వీళ్లు సైతం ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. జాబ్లు వచ్చిన వారు మళ్లీ పరీక్ష రాస్తూ అధిక కాంపిటిషన్ తీసుకొస్తున్నారని కొత్త నర్సింగ్ క్యాండిడేట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.