ఇల్లు ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ ఆధ్వర్యంలో వినతి పత్రం
- ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఎమ్మార్వో కి వినతి పత్రం
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరమ్మ ఆదేశాల మేరకు పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు నందిమంగళ,ఎన్టీఆర్ కాలనీ, కోనేటి పాలెం లో నివసిస్తున్న ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. 67 మంది ఇల్లు స్థలాలు లేక కొందరు బంధువులు ఇంట్లో నివసిస్తున్నారు కొందరు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కొందరు కూలి పని చేస్తూ అద్దె కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అందుకారం చేత హ్యూమన్ రైట్స్ ప్రొడక్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ తరపున ఎమ్మార్వో కి తెలియజేశాము. ఈ సందర్భంగా ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పీపుల్స్ఏ పీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడుతూ ఇంటి స్థలం ఇల్లు లేని నిరుపేదలు ఎందరో ఉన్నారని వీరందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆయన ఎమ్మార్వోను కోరారు. గుద్ధ గత కొంతకాలంగా ఇంటి స్థలం కోసం ఇల్లు కోసం అనేక సందర్భాల్లో అధికారులకు వినతి పత్రాలు తినప్పటికీ ఇంతవరకు సమస్య సమస్యగానే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి స్థలాలు ఇల్లు లేని వారందరికీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రఘు, పలని, బుజ్జి, దళిత నాయకులు మహిళలు పాల్గొన్నారు.