Sports & Games

Breaking News

ఆశా వర్కర్లను రెగ్యులర్‌ చేయాలి

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి – సామాజిక భద్రత, పెన్షన్‌ కల్పించాలి: జంతర్‌ మంతర్‌ వద్ద ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ ‘ఆశా సంఘర్ష్‌ ర్యాలీ’ – జాతీయ స్థాయిలో పోరాటాలు ఉధృతం : కె.హేమలత న్యూఢిల్లీ బ్యూరో:ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లను రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్‌ అండ్‌ ఫెసిలిటేటర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద సీఐటీయూ అనుబంధ ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేలాది మంది ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లు ‘ఆశా సంఘర్ష్‌ ర్యాలీ’ నిర్వహించారు. సామాజిక భద్రత కల్పించాలని, పెన్షన్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మార్చ్‌లో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ కార్పొరేట్‌, మతతత్వ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మార్చేందుకు ఉమ్మడి పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మోడీ సర్కార్‌ కార్మికుల హక్కులను హననం చేస్తోందని, అందులో భాగంగానే లేబర్‌ కోడ్‌లను తీసుకొస్తుందని విమర్శించారు. కార్మికుల సామాజిక భద్రతను గాలికి వదిలేసిన మోడీ సర్కార్‌ మెడలు వంచాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన పోరాటాలు చేస్తున్న ఆశా వర్కర్లను ఆమె అభినందించారు. జాతీయ స్థాయిలో పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపు నిచ్చారు. ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మధుమిత బందోపాధ్యాయ మాట్లాడుతూ చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లు, సమస్యలను వివరించారు. సంఘం ఇప్పటివరకు చేసిన పోరాటాలు, విజయాలను తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీల సంఘీభావంఆశా వర్కర్ల మార్చ్‌కు సీపీఐ(ఎం) ఎంపీలు సంఘీభావం తెలిపారు. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీలు బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, వి. శివదాసన్‌ సంఘీభావం తెలిపి సభను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటులో ఆశాల సమస్యలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో విజ్జూ కృష్ణన్‌ (ఏఐకేఎస్‌) సంఘీభావం, మద్దతు తెలిపారు. సోదర సంఘాలు మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం నేత జై భగవాన్‌, అంగన్‌వాడీ సంఘం నేత ఎఆర్‌ సింధు ఆశా వర్కర్ల పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా స్కీమ్‌ వర్కర్ల ఉద్యమాన్ని, ఐక్యతను క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సహా నాయకులు ప్రసంగిస్తూ..ఆశాల పోరాటాలకు సంఘీభావం , మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు నోని లిక్సన్‌ (అసోం), ప్రసన్న కుమారి (కేరళ), మధుజా సేన్‌ రారు (పశ్చిమ బెంగాల్‌), హసుమతి పర్మార్‌ (గుజరాత్‌), ఆనంది మణిక.. (మహారాష్ట్ర), కబితా సోలంకి (మధ్యప్రదేశ్‌), దిల్షాద ( కాశ్మీర్‌), సంగీత (ఉత్తరప్రదేశ్‌), శివ దుబే (ఉత్తరాఖండ్‌), సీమా (పంజాబ్‌), లీలావతి (రాజస్థాన్‌) మాట్లాడారు. అధ్యక్ష వర్గంలో సునీత (హర్యానా), మమతా రభా (అసోం), ప్రభావతి ఎంబి (కేరళ), పుష్పా పాటిల్‌ (మహారాష్ట్ర), పూజా కనోజియా (మధ్యప్రదేశ్‌), కళావతి (ఉత్తరాఖండ్‌), మంగమ్మ (తెలంగాణ) ఉన్నారు. వేతనాలు పెంచకపోతే సమ్మెకు సిద్ధం ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ కార్యదర్శి సురేఖ మార్చ్‌ను ముగిస్తూ కార్యాచరణను ప్రకటించారు. తదుపరి బడ్జెట్‌లో వేతనాలు, ప్రోత్సాహకాలను పెంచకపోతే స్వతంత్రంగా, ఉమ్మడిగా సమ్మెతో సహా మిలిటెంట్‌ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమస్యలను ప్రజ ల్లోకి తీసుకెళ్లడంతో కార్మిక-కర్షక ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, రాష్ట్రాల్లో పోరాటాన్ని ఉధృతం చేయాలని ర్యాలీ పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వంపై మార్చ్‌ ఆగ్ర హం వ్యక్తం చేసింది. అందరికీ ఆరోగ్యం కోసం, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు అందరూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించింది. కార్యక్రమం ప్రారంభంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోరా టాల సందర్భంగా రూపొందించిన సాంస్కృతిక కార్య క్రమాలు పాటలతో హాజరైన వారిని ఉత్సాహపరిచాయి.