జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 12 మందికి విసెక్టమీ ఆపరేషన్లు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మంచిర్యాల్,(ఆరోగ్యజ్యోతి): మంచిర్యాల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశాల మేరకు 12 వెసెక్టమీ కుటుంబాన్నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ శిబిరంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అనిత,డాక్టర్ కృపాబాయి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్ ప్రసాద్ పిపి యూనిట్ సిబ్బంది డాక్టర్ కాంతారావు,డాక్టర్ దామోదర్, రాజేశ్వర్ స్టాఫ్ నర్సులు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ మగవారి పాత్ర కుటుంబ నియంత్రణలో ఎంతో ముందుంటుందని ఆయన తెలిపారు. మగవారికి పుట్టులేని ఆపరేషన్ ఉంటుందని ఆపరేషన్ చేయించుకున్న 24 గంటల్లో ఏ పనైనా చేసుకోవచ్చని తెలిపారు. తాత్కాలిక పద్ధతులతో చేసే విసర్ట్ ని ఆపరేషన్‌కు మగవారు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా టిఫెట్టమీ ఆపరేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు.