Sports & Games

Breaking News

తెలంగాణలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):తెలంగాణ రాష్ట్రం లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో ఉన్న  సుమారు 2 లక్షల మంది పనిచేస్తున్న  ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరుపున  ఉన్నటువంటి అన్ని  సుమారు 30 శాఖల సంస్థల, మరియు వివిధ సంఘాల ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ , సిఐటియు నాయకులు  అందరూ ఒకే వేదిక మీద ఐక్యమత్యం తో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు నెరవేర్చడం కోసం డిమాండ్ లు సాధించుట కొరకై  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరుపున ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఉమ్మడి కార్యచరణ తో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుటకు ప్రణాళిక, దిశా నిర్దేశం  ఏర్పాటు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారు .  ఈ సమావేశం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చైతన్యం కల్పించడానికి  మండల,జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. అన్ని సంఘాల నాయకులు అందరూ  ముఖ్యమంత్రినీ  కలిసి ఏజెన్సీ  విధానం రద్దు ,  పలు సమస్యల మీద మెమొరాండం ఇవ్వాలని నిర్ణహించారు.గ్రూప్  4 నియామకాల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరగకూడదు . వచ్చే శితాకాలం అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద చర్చ జరిగాలి న్యాయం చేసేలా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, రాష్ట్ర ముఖ్య మంత్రి,మంత్రులను, నియోజవర్గ  శాసనసభ సభ్యులను మీడియా ముఖంగా కోరడం జరిగింది. ఈ సమావేశం లో (జేఏసీ) జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, జేఏసీ  జనరల్ సెక్రెటరీ బి. గోవర్ధన్,  ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నరసింహ, సిఐటియు ఈశ్వర్ రావు స్టేట్ వైస్ ప్రెసిడెంట్,కృష్ణారెడ్డి ఫెడరేషన్, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం, ఆకుల శ్రీనివాస్ జనసమితి కార్మికుల అధ్యక్షుడు, దుర్గం శ్రీనివాస్ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు, యాదగిరి ఆరోగ్య శ్రీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు,శంకర్ సంక్షేమ శాఖ హాస్టల్లో అధ్యక్షుడు, రవికిరణ్ బోనగిరి ఇరిగేషన్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్, జేఏసీ నాయకులు శ్రీధర్, ఇరిగేషన్ సంతోష్ గోవర్ధన్,దిలీప్ ఫారెస్ట్,అశోక్ బీ.సీ గురుకుల,బాలకృష్ణ రెడ్డి వాటర్ వర్క్స్, సురేందర్ గౌడ్  , వినోద్, యాదయ్య సంతోష్, విజయలక్ష్మి, సునీత, భరత్,ప్రవీణ్ మిషన్ భగీరథ వ్యవస్థాపక అధ్యక్షులు,క్రాంతి ESI, శ్రీనివాస్ సోషల్వెల్ఫేర్, శ్రీకాంత్ అగ్రికల్చర్,అజిత్ NCC,జహీర్,గబ్బర్,రవి,రాజు, రాము, గడ్డం జగదీష్ జిహెచ్ఎంసి ఔట్సోర్సింగ్ నాయకులు, హైదరాబద్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు... కార్యచరణ వచ్చేనెల మొదటి వారంలో ప్రకటిస్తామని తెలియజేశారు...