25న సెకండ్ ఏఎన్ఎం లో డి ఎం అండ్ హెచ్ ఓ కలెక్టర్ రేట్ల ముందు ధర్నా
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎం, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంలు వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు హెచ్ఆర్ ఏఎన్ఎంలు తోపాటు తెలంగాణ లోని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అందరూ ఏఎన్ఎంలు ఉద్యోగ సాధన కోసం మరియు హక్కుల సాధన కోసం ఈనెల 25 సోమవారం రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాలు ఎదుట మరియు కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చేయాలని వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం పోరాట కమిటీ జేఏసీ పిలుపునిచ్చింది. గత 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల ముందు నుండి పనిచేస్తున్న ఏఎన్ఎంలో తోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్తో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ తో పాటు అన్ని పథకాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి. చదివేందుకు టైమే లేదు ఆపైన 18 గంటల విధులు 405 కు పైగా రికార్డులు ఆన్లైన్ వర్క్ ఆఫ్ లైన్ వర్క్ సభలు సమావేశాలు వైద్య శిబిరాలు టెలికాన్పైరెన్సులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సభలు సమావేశాలు మాతా శిశు సంరక్షణతో పాటు ఎన్నో రకాల పథకాలను పూర్తి చేస్తూ ఇటు చదవాలంటే ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే ఆలోచించి చెప్పాలని వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఏ విధంగా చదవాలో చెప్తే అదే రీతిలో చదివి ఉత్తిటంలో ఉద్యోగం సంపాదిస్తామని కూడా కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పోస్ట్లు ఏమో తక్కువ కేవలం ఒక నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏ ఎన్ ఎం ఏ 4000 పైగా ఉన్నారని అలాగే వైద్య విధాన పరిషత్ వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్ తో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో అందర్నీ కలుపుకుంటే ₹7,000 మందికిపైగా ఏఎన్ఎంలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ ఈ వయసులో టెస్ట్ పెడితే ఎలా సాధ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం టెస్టు విధానాన్ని రద్దుచేసి విడుదలవారీగా ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.