Sports & Games

Breaking News

పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


అదిలాబాద్: పాఠశాలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు కోరారు. గురువారం రోజు జిల్లా పరిషత్ హై స్కూల్ యాపలగూడ లో పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి.కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి షేక్‌ ఇర్ఫాన్‌. ఉమ్మడి జిల్లా ఇంచార్జి మహిళా విభాగం తన్నీరు హేమావతి. మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రసన. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ స్వప్న. కార్యదర్శి పి.వెంకటేష్. ప్రసన్న, పర్సన్ గోలీ శివ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల ఆహారం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది అని తెలిపారు పిల్లలకు మనం ఇచ్చే ఆహారంలో విటమిన్స్ మినరల్స్ క్యాల్షియం జింక్ పొటాషియం తోపాటు పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని రకాల పోషకాహారాలు ఉండేవిధంగా వంటలో చేసి పిల్లలకు ఇవ్వాలని తెలిపారు. పాఠశాలకు వచ్చే పిల్లలకు సరైన రీతిలో ఆహారం అందించినట్లయితే వారి ఎదుగుదల బాగుండాలని తో పాటు మానసికంగా కూడా బాగుంటారని తెలిపారు. పిల్లలు మానసికంగా బాగుంటే చదువులో ముందు ఉంటారని మెదడు సక్రమంగా పనిచేస్తుందని తెలిపారు.