దివ్యంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ .. బోరంచు శ్రీకాంత్ రెడ్డి కి వినతిపత్రం
అదిలాబాద్ : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హ్యాండి క్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇదివరకే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి సీతక్క గారిని కలిసి హైదరాబాద్ లో ధర్నా తలపెట్టిన నేపథ్యంలో మంగళవారం శ్రీకాంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్బంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, హెల్త్ కార్డులో పేర్లు ఉన్న పిల్లలకు పెన్షన్లను తొలగించడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ లో వారికి నివాస స్థలాలను కేటాయించి కాలనీ నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కి వివరించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. విషయం పై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘం సభ్యులు ఇదివరకు చేసిన సేవలకు వారిని సన్మానించారు. మునుముందు ఇక పలుసేవ కార్యక్రమాలు చెప్పటలని వారిని కోరారు,కార్యక్రమంలో సంఘం సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, ఫైసల్ అహ్మద్, తార ఉషాన్న, షేక్ ఖలీఫ్, సయ్యద్ సాజిద్ తదితరులు ఉన్నారు.