ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర అధికారుల దాడులు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ రెస్టారెంట్ల..పలు హోటల్స్, స్వీట్ హౌస్ ల పై దాడులు..!
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,పి.స్వాతి, శ్రీషిక లతో కూడిన బృందం
ఆదిలాబాద్ పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఫ్యామిలీ రెస్టారెంట్ ఢిల్లీవాలా స్వీట్ హౌస్ వెంకటేశ్వర స్వీట్ హౌస్ మరియు లోటస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లలో లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి( నాయుడు గారి కుండ బిర్యాని ) ఫ్యామిలీ రెస్టారెంట్ నందు రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో 30 కిలోల 15 వేల రూపాయల విలువ కలిగిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను నిలువ చేసి, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్ మరియు చేపలు లేబుల్ తదితర వివరములు లేకుండా ఉన్నటువంటి పన్నీరు మసాలాలు ఫంగస్ బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే లోటస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నందు నాలుగు వేల విలువగల రిఫ్రిజిరేటర్లో దీర్ఘకాలం నిల్వ ఉంచిన వాసన పట్టిన మాంసపు ఉత్పత్తులు, 30 కిలోల గ్రేవీ ఎక్స్పైర్ వనస్పతి బూజు పట్టిన కూరగాయలను ధ్వంసం చేయడం జరిగింది, తర్వాత ఆహార పదార్థాలు తయారు మరియు నిల్వ చేసే కిచెన్ సరేనటువంటి వెలుతురు లేకుండా పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడి పలు ఎఫ్ఎస్ఎస్ఏ కి సంబంధించిన నోటీసులు జారీ చేయడం జరిగింది. పలు అనుమానాస్పద శాంపుల్స్ ని సేకరించడం జరిగిందిమరియు వినాయక చౌక్ నందుగల ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వీట్ హౌస్ నందు కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అపరిశుభ్ర వాతావరణం చూసి అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ స్వీట్ హౌస్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ ఐన వి.జ్యోతిర్మయి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు నోటీసులు జారీ చేసి అనుమానిత సేకరించి ల్యాబ్ కి తరలించడం జరిగింది. అధిక మోతాదులో క్యాన్సర్ కారకాలైన కృత్రిమ రంగులను ఉపయోగించి తయారు చేస్తున్నటువంటి స్వీట్స్ ను అనేక సార్లు మరిగించిన నూనెను, పురుగులు పట్టి దుర్వాసన తో ఉన్న పప్పులను, సమోసాలకు ఆలు కుర్మాలను అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది.. ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార తయారీదారులు మరియు ఆహారం అమ్మేవారు ఎంతటి వారైనా సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొనడం జరిగింది.