Sports & Games

Breaking News

కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ నియామకలో అవకతవకలు ?... -కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన స్టాఫ్ నర్సులు.

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

 - కౌన్సెలింగ్ కేంద్రం వద్ద నిరుద్యోగుల ఆందోళన
- రంగంలోకి దిగిన కలెక్టర్.. ఒకరి సస్పెన్షన్కు ఆదేశం

వరంగల్ , అక్టోబర్ 20 (ఆరోగ్యజ్యోతి): వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఎంపికలో భారీ అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు అనుకూలమైన వారికి మాత్రమే కౌన్సెలింగ్కు హాజరుకావాలంటూ ఫోన్ సందేశాలు పంపి అర్హులైన తమకు అన్యాయం చేశారని నిరుద్యోగులు నిరసనకు దిగారు. శనివారం ఉదయం హనుమకొండ జిల్లా పరిషత్ హాలులో వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని 15 కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఎంఎలొచ్పి ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని అభ్యర్థులను ఆహ్వానించారు. ఎంపిక ప్రక్రియలో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని నిరుద్యోగులు అక్కడికి చేరుకొని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ కంటే మార్కులు తక్కువగా వచ్చిన వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ నిలదీశారు. అదేవిధంగా రోస్టర్ పాయింట్లు తమకు అనుకూలంగా ఉన్న వారికి వచ్చేవిధంగా సగదిద్దారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

*కలెక్టరు ఫిర్యాదు
ఈ జాబితాపై కొందరు అభ్యర్థులు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కలెక్టర్ డీఎంహెచ్వి కార్యాలయ సూపరింటెండెంట్ న్ను తీసుకొని నేరుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి విచ్చేశారు. ఇందుకు బాధ్యులైన ఓ కాంట్రాక్టు ఉద్యోగిని సస్పెండ్ చేయాలని వెంటనే ఆదేశించారు. అలాగే కార్యాలయం సూపరింటెండెంట్, సీనియర్ అసిసెక్టంట్కు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఈ వ్యవహారంలో మొత్తం ఫైళ్లను తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు.

ఒక్కో పోస్టుకు రూ.5లక్షలు?
ఈ కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీలో సెక్షన్ జూనియర్ ఆసిస్టెంట్ నుంచి మొదలుకొని కార్యాలయ సూపరింటెండెంట్ వరకు ఒక్కో పోస్టు కు రూ.లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అను కూలమైన వ్యక్తులకు ఇప్పించేందుకు మెరిట్లో ఉన్న వారికి ఎవరికి సందే శాలు పంపలేదని, మెరిట్లో లేని వారికి మాత్రమే మొబైల్కు సందేశాలు పంపారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు రోజులుగా ఈ సెక్షన్ చూసే సిబ్బంది అంతా ఒకే గదిలో మకాం వేసి అవినీతికి తెర లేపినట్లు తెలుస్తోంది. గతంలో కాంట్రారక్టు ఉద్యోగాల నియామక విషయంలో కూ డా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల సెక్షన్లుకూడా మార్చినప్పటికీ యధావిధిగా ఈ ఆక్ర మాలు జరుగుతున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు.

- కౌన్సెలింగ్ వాయిదా 
-  వరంగల్ డీ ఎం అండ్ హెచ్ ఓ. డాక్టర్. కే.వెంకటరమణ
స్టాఫ్ నర్సుల ఎంపిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వాయిదా వేశాం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తాం. నిరుద్యో గులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.