పోలీసు అమరవీరుల త్యాగనీరతి చిరస్మానీయం
.విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం..


- తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
అదిలాబాద్: శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల సేవలు సమాజం ఎప్పటికీ మరిచిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలోని పోలీసు అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. వారి సేవలను గుర్తుచేసుకుంటూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయమన్నారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎలాంటి విఘాతం తలెత్తకుండా ప్రజలకు రక్షణగా నిలిచి పోలీసుశాఖ మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, నాయకులు కొరటి ప్రభాకర్, బాలకృష్ణ, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.