ఆదిలాబాద్ జిల్లాలో మందుల కొరత లేకుండా చూస్తాం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయ చీప్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మంజునాథ్
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మందుల కొరకు లేకుండా చూస్తుందని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి మంజునాథ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారిగా నియమితులై ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా ఆయనను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను మంజునాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి మంజునాథ్ మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మందుల కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో మందుల నిల్వలు ఎన్ని ఉన్నాయి మందులు అవసరం ఉన్నవి ఏంటి అనే దానిపై పరిశీలిస్తున్నట్టు ఆయన వివరించారు. మందులు నిల్వ ఉండకుండా అవసరం ఉన్న మందులు వాడే విధంగా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ఈ ఔషధ వచ్చిన తర్వాత మందులు అవసరం ఉన్నవి వాడుతున్నారని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్లీ ఆర్డర్ ఇవ్వడం కాకుండా వైద్యులే ఏ ప్రాథమిక ఆరోగ్య కాండానికి ఏమీ మందులు అవసరం రోగుల సంఖ్య ఎలా ఉంటుంది అనే దానిపై పరిశీలిస్తున్నట్టు ఆయన వివరించారు. గతంతో పోలిస్తే సిడిఎస్ లో మెరుగుపడ్డాయని తెలిపారు ప్రభుత్వం ఎవరికి ఇబ్బందులు లేకుండా గతంలో పది జిల్లాల్లో ఉండే మందులు తీసుకుపోయి వచ్చేదని ప్రస్తుతం 33 జిల్లాల్లో సిడిఎస్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీని ద్వారా మందులు తీసుకపోవడం సులభంగా ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పి.హెచ్.సి లో కొంతవరకు ఫార్మసిస్టుల కొరత ఉందని ప్రభుత్వం కూడా ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు అవసరం ఉన్న మందులనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ముందుగానే ఏ మందులు అవసరం ఉంటాయో వాటిని తెలిపినట్లైతే సరఫరా కూడా ప్రభుత్వానికి సులువుగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట డిడిటి పిఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ గణాంకల అధికారి బ్రహ్మానందం రెడ్డి తదితరులు ఉన్నారు.