Sports & Games

Breaking News

దీపావళి ఆఫర్లను చూసి వినియోగదారులు మోసపోవద్దు - కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

అదిలాబాద్; దీపావళి ఆఫర్ల పేరుతో వినియోగదారులను వ్యాపారస్తులు మోసం చేస్తున్నారని ఆఫర్లను చూసి వినియోగదారులు కూడా మోసపోవద్దని కంజమార్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు కిరణ్ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారస్తులు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల రంగులతో కూడిన ఆఫర్లు పెడుతున్నారని ఆ ఆఫర్లలో పాత వస్తువులు ఉంటాయని దీన్ని వినియోగదారుడు అర్థం చేసుకొని ఆఫర్ల జోలికి వెళ్ళవద్దని సంఘం సభ్యులు సూచించారు. వినియోగదారుడు ఒకే రకంగా ఆలోచించాలని తెలిపారు వాడికి వచ్చిన ధర కంటే ఆఫర్ల ధరకు ఇవ్వడం గురించి మనం ఆలోచించాలని తెలిపారు ఆఫర్లలో ఇస్తే వ్యాపారస్తులకి లాభం ఏమీ ఉండదని తెలిపారు పాత వస్తువులు ఉంటాయి కనుక అవి అమ్ముడుపోని విధంగా ఉంటాయని దానికి ఆఫర్లు అనే పదం జోడించి వివిధ బహుమతులు ఇస్తూ తక్కువ ధరకు ఇస్తూ వినియోగదారున్ని ఆకర్షించి అంటగడతారని తెలిపారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా వారు కోరారు. హోటల్లో కానీ కొనుగోలు లో ఏదైనా మోసం జరిగితే వెంటనే కంజమార్ రైట్స్ ఫోర్ అమ్మి సంప్రదించాలని వారు ఈ సందర్భంగా కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఇర్ఫాన్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు హేమావతి, భావన సింగ్, రమా, స్వప్న, కిరణ్ కుమార్ తో పాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.