Sports & Games

Breaking News

ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నర్ర రాజ్ కుమార్

.ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 
నర్రా రాజ్ కుమార్..


సిద్దిపేట, చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. 2019 లో మొట్టమొదట ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శి గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరింత ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదల తో చదివి మిషన్ భగీరథ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే AEE అసిస్టెంట్ ఎగ్జ్గ్యూటీవ్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో నియామక పత్రం అందుకున్నాడు. హుస్నాబాద్ సబ్ డివిజన్ లో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామం లో  చిరు ఉద్యోగి నర్రా రాజయ్య, లక్ష్మీ దంపతులకు పేద కుటుంబం లో జన్మించిన రాజ్ కుమార్ చిన్న తనం నుండే చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చే వాడు.. ప్రాథమిక విద్య పుల్లూరు లోని నలంద విద్యాలయం లో పూర్తి చేసిన రాజ్ కుమార్ 8th నుండి 10 వరకు సిద్దిపేట గాయత్రి విద్యాలయం లో చదివాడు. 10 th మార్కుల ఆధారంగా హైదరాబాద్ నారాయణ జూనియర్ కళాశాల లో ఉచితంగా సీటు లభించింది. ఇంటర్ పూర్తయిన తరువాత ఈ లో మంచి మార్కులు సాధించి Btech TKR ఇంజినీరింగ్ కళాశాల లో జాయిన్ అయ్యాడు.. మంచి మార్కులతో Btech పూర్తి చేశాడు.. అప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగాల వేట లో పడ్డ రాజ్ కుమార్ అనునిత్యం పోటీ పరీక్ష లకు ప్రిపేర్ అవుతూ అందుకు సిద్ధం అయ్యాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాడు.. ఆ ఉద్యోగంలో ఉండగానే VRO ఉద్యోగం వచ్చింది. కొండపాక మండల VRO గా పనిచేస్తూనే 2021 లో గ్రూప్ 4 పరీక్ష రాసి రెవిన్యూ శాఖలో  జూనియర్ అసిస్టెంట్ గా మెదక్ జిల్లా లో ఉద్యోగం సాధించాడు. VRO నుండి ఇతర శాఖలకి సర్దుబాటు ప్రక్రియ లో  మెడికల్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తూనే మున్సిపల్ శాఖ లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ గా ఉద్యోగం సాధించాడు.. దానితో పాటు ఆ
2022 లో అప్పటి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కోసం అసిస్టెంట్ ఎజీగ్యూటీవ్ ఇంజినీర్ జాబ్ లకోసం వేసిన నోటిఫికేషన్  ద్వారా అప్లై చేసి గొప్పగా ప్రిపేర్ అయి పరీక్ష రాసాడు.. 2024 ఆగస్ట్ నెలలో ఫలితాలు వెలువడ్డాయి..అందులో ఉత్త్తీర్ణత సాధించి AEE ఉద్యోగం సాధించాడు. ఇది రాజ్ కుమార్ వరుసగా సాధించిన ఆరవ ఉద్యోగం.. తల్లి దండ్రుల ప్రేరణ... చదువు చెప్పిన ఉపాధ్యాయుల ప్రోత్సహం తో తాను ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించానని రాజ్ కుమార్ ఈ సందర్బంగా పత్రిలకు తెలిపారు..భవిష్యత్ లో IAS సాధించాల్లన్నదే తన లక్ష్యం అని అందుకోసం కృషి చేస్తానని నర్రా రాజ్ కుమార్ ఈ సందర్బంగా తెలిపారు. పట్టుదల తో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నర్రా రాజ్ కుమార్ ను పలువురు అభినందించారు..