తోషం నేతకాని సంఘం ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025351
గుడియత్నూర్, తోషం: తోషం గ్రామంలో నీ నేతకాని సంఘం ఆధ్వర్యంలో దుర్గా నవ్వరాతులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు తోపాటు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు రోజైనా శుక్రవారం రోజు నేతకానికి సంఘం ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల ముగింపు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న ప్రసాదం కార్యక్రమం లో కాలనీ ప్రజలతోపాటు గ్రామ ప్రజలు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.