Sports & Games

Breaking News

అదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తాం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ 

అదిలాబాద్: -సిపిఎం పార్టీ పట్టణ 11వ మహాసభలు  స్థానిక సుందరయ్య భవనంలో ఘనంగానిర్వహించారు .ముందుగా పార్టీ సీనియర్ నాయకురాలు లంక జమున జెండావిష్కరణ చేశారు . అమర వీరులు సీతారాం ఏచూరి ,పుచ్చల పల్లి సుందరయ్య ,బుద్ధదేవ్ భట్టాచార్య ,మల్లు స్వరాజ్యం లకు మహాసభ నివాళ్లు అర్పించింది . ఈ సందర్బంగా పార్టీ మహాసభ ప్రతినిధులనుద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ  సీపీఎం పార్టీ  ఇండ్లస్థలాల కోసం చేసిన పోరాటాల ఫలితంగా  పట్టణం విస్తరించింది అన్నారు . రణదివే నగర్ ,సుందరయ్య నగర్ ,భగత్ సింగ్ నగర్ ,దుర్గానగర్ ,వరలక్ష్మి నగర్ , లీలా నగర్ , గాంధీ నగర్ ,లాంటి అనేక వార్డులు  సీపీఎం పోరాటాల ఫలితంగా ఆవిర్భవించినవే అన్నారు . ఆదిలాబాద్ నుండీ ఆర్మూర్ వరకు రైల్వే లైన్ సాధన , సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సీసీఐ ) పునర్ ప్రారంభం కోసం , విమానాశ్రయం నిర్మాణం ,టెక్సటైల్స్ పార్క్ ఏర్పాటు కోసం సిపిఎం ఉద్యమిస్తుందని గుర్తు చేశారు ,భవిష్యత్తు లోను ఈ పోరాటంకొనసాగిస్తామన్నారు .పేదలు ,కార్మికులు ,ఉద్యోగ ,ఉపాధ్యాయ ,కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులను కాపాడ్డానికి సిపిఎం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు .  పట్టణంలో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూముల రక్షణ కోసం , పట్టణ సమగ్రాభివృద్ధి కోసం పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకరాఘవులు ,అన్నమొల్ల కిరణ్ , పూసం సచిన్ , పట్టణ కార్యదర్శి ఆర్ .సురేందర్ , నాయకులు ఆర్ .మంజుల , కార్మిక సంఘం నాయకులు బొజ్జ ఆశన్న ,అగ్గిమల్ల స్వామి ,పండుగ పొచ్చన్న ,ఐద్వా నాయకులు  కోవే శకుంతల తదితరులు పాల్గొన్నారు .