Sports & Games

Breaking News

కృష్ణా ఎక్స్ ప్రెస్ కి 50 ఏళ్ళు.. ప్రస్తుతం ఆదిలాబాద్ నుండి తిరుపతి నడుస్తున్న కృష్ణ

జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి కృష్ణ ఎక్స్ ప్రెస్ కి
 అనుబంధం ఉంది. ఈ జోన్‌ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి. కృష్ణా ఎక్స్‌ప్రె్‌సకు యాభై ఏళ్లు అప్పట్లో పగటి పూట నడిచే తొలి ఎక్స్‌ప్రెస్‌ రైలు మొదట్లో విజయవాడకే... అనంతరం తిరుపతి వరకు పొడిగింపు జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జోన్‌ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి. అంతేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రారంభమైందే 1966, అక్టోబరు 2వ తేదీన! అంతేగాక తెలుగువారికి సుపరిచితమైన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ కూడా యాభై ఏళ్ల క్రితం ఇదే తేదీన మొదలైంది. అక్టోబరు 2, 1974లో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకి డిజీల్‌ ఇంజిన్‌తో లాంఛనంగా దీన్ని ఆరంభించారు. ఇరు ప్రాంతాల మధ్య సుప్రసిద్ధమైన కృష్ణా నది ఉండటం వల్లె దానికి ‘కృష్ణా ఎక్స్‌ప్రెస్‌’ అనే పేరును పెట్టారు. అయితే అప్పట్లో పగటిపూట నడిచే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇదే కావడం విశేషం. మొదట్లో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు మాత్రమే నడిచేది. తరువాత గుంటూరు వరకు పొడిగించారు. ప్రస్త్తుతం ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి మధ్య సేవలు కొనసాగుతున్నాయి. 1980 ప్రాంతంలో ఒంగోలు, నెల్లూరు వెళ్లడానికి విజయవాడలో రైలు మారి వెళ్లవలసి వచ్చేది, అనంతరం తక్కువ ఖర్చుతో తిరుపతి వెళ్లే అవకాశం ఏర్పడింది. దాదాపు ప్రయాణం మొత్తం పగటి పూట కావడంతో ప్రయాణీకుల ఆదరణ పొందింది. బుధవారం యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు తెలుగువారు కృష్ణా ఎక్స్‌ప్రె్‌సతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.