అదిలాబాద్ మండలంలో దండారి ఉత్సవంలో పాల్గొన్న కంది శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451




ఆదిలాబాద్ రూరల్ మండలంలో కంది శ్రీనివాస రెడ్డి పర్యటన
దండారి ఉత్సవాలలో పాల్గొంటూ ఆదివాసీలకు దుస్తుల పంపిణీ
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి దండారి ఉత్సవాలలో సందడి చేస్తున్నారు. దీపావళి పండగకి ముందు ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే దండారి సంబరాలలో పాల్గొన్నారు.ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించిన ఆయన భోజన విరామం వరకు మామిడి మామిడి గోడి,దహెగూడ, మొలాల్ గూడ ,లొహార, సలాయి తాండ,సాలెగూడ, కొలామ్ తిప్ప, దార్లొద్ది ,తిప్ప,ఖండాల గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులు డప్పుచప్పుళ్లు ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఆదివాసీలందరికి పండగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులు పంపిణీ చేసారు. తను ఓడిపోయినా ప్రజల మద్యే ఉంటానన్నారు. గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు.ఆదివాసీలకు దండారి దీక్ష సందర్భంగా కొత్త బట్టలు పెట్టి సత్కరించడానికి వచ్చానన్నారు. ఈ పర్యటన ద్వారా ఆదివాసీల సమస్యలు కూడా తెలిసినాయన్నారు.ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం తో పాటు ప్రభుత్వ పథకాలు అందరికి వస్తాయన్నారు.ఇంఛార్జి మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం ప్రతీయేడు దండారికి 15వేలు ఇస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అన్నారు. పోడుభూమలుకు పట్టాలిచ్చే పార్టీఅన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్నారు.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సుప్రయాణం , ఇంటికి 500 లకు గ్యాస్ సిలిండర్ ,ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు. గత ప్రభుత్వాలు పదేళ్లలో చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,సుధాకర్ గౌడ్ , ఎంఏ షకీల్ ,భోజారెడ్డి , దేవిదాస్ చారి ,పోరెడ్డి కిషన్ ,అల్చెట్టి నాగన్న,జంగు పటేల్, భీంరావు, నారాయణ రెడ్డి , భూమయ్య,సంటెన్న,సోమన్న,రాజేశ్వర్ ,భగవాండ్లు,గంటుబాయి,రాధాబాయి,చిత్రు పటేల్,శ్యామ్ రావు పటేల్ ,సోనేరావు ,లక్ష్మణ్ ,రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.