Sports & Games

Breaking News

విద్యుత్ చార్జీల పెంపుబారం పాపం బి.ఆర్.ఎస్.దే.. పసుపుల చంటి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

*విద్యుత్ చార్జీల పెంపు భారం పాపం బీఆర్ఎస్ దే: పసుల చంటి*

*విద్యుత్ చార్జీలు పెంచకపోగా గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నాం

*పదేళ్లలో రాష్ట్ర ప్రజలపై 20 వేల కోట్ల విద్యుత్ భారం మోపిన కేసీఆర్
*ప్రజా పాలనపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు
*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి 

గడిచిన పది సంవత్సరాల కాలంలో కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలపై 20 వేల కోట్ల పైన విద్యుత్ భారం మోపి, రెండు మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరగొట్టి ఇప్పుడు తామేదో ఘనకార్యం చేసినట్టుగా విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకుంటున్నామనడం హాస్యాస్పదం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అన్ని కేటగిరీల చార్జీలు ప్రతి సంవత్సరం పెంచాలా లేదా ఫిక్స్ చార్జీలు నిర్ణయించడానికి ఈఆర్సీ సమావేశం అవుతుందని  దాని సందర్భంగా ప్రభుత్వం చార్జీల పెంపదల గురించి ఎటువంటి యోచన చేయలేదని ప్రజలకు అనుగుణంగా  రాష్ట్రంలో ప్రజా పాలన కింద దాదాపు 50 లక్షల కుటుంబాలకు గృహ అవసరాల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతాంగానికి ఉచిత కరెంట్ అందిస్తుంటే కేవలం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు విద్యుత్ చార్జీల పెంపుదలా అని పుకార్ల సృష్టించి, వారిది వాళ్లే పాలాభిషేకాలు చేసుకోవడం వెర్రితనానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పద్ధతి మార్చుకోవాలని సూచించారు డిస్కం లు ప్రతిపాదించిన 12 వేల కోట్ల చార్జీల పెంపు భారాన్ని వినియోగదారులపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని గుర్తు చేశారు.