Sports & Games

Breaking News

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నూతన కమిటీలోకి ఆదిలాబాద్ యువత

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా బండ శ్రీనివాస్ , కుర్ర రవీందర్

అదిలాబాద్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గంలోకి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువతను కార్యవర్గంలోకి తీసుకున్నారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బండ శ్రీనివాస్ కుర్ర రవీందర్ లను రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా నియమిస్తూ తెలంగాణ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. నూతనంగా రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా ఎంపికైన బండ శ్రీనివాస్ కుర్ర రవీందర్లు మాట్లాడుతూ పద్మశాలి యువతను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి సాధిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి ప్రగతి పతంలో హక్కుల సాధన కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. అంతేకాకుండా ఆదిలాబాద్ పట్టణంలో టెక్స్టైల్ పార్క్ సాధించే దిశగా అడుగులు ముందుకు ఇస్తామని తెలిపారు. పద్మశాలి కులంతో పాటు యువత ఆర్థికంగా ఉపాధి పరంగా అన్ని రంగాల్లో ముందుండేందుకు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో వెనుకబడిన పద్మశాలి లు రాబోయే ఎన్నికల్లో యువత పోటీ చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. చేనేత ఐక్యవేదికకు అండగా నిరంతరం ఉంటామని వారు తెలిపారు తమపై పూర్తి నమ్మకంతో తెలంగాణ చేనేత ఐక్యవేదిక యువజన సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు తెలంగాణ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తో పాటు కుల బాంధవులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.