క్యాన్సర్ వ్యాధి శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు ,- డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కృష్ణ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి):తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలిటివ్ కేర్ లో చికిత్సలు అందించడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ తెలిపారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలోని పోలికేర్ క్లినిక్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లాలో 2018 సంవత్సరంలో పాలీ కేర్ ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు దీనిలో క్యాన్సర్ రోగులకు చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 620 మంది క్యాన్సర్ రోగులకుచికిత్సలు అందించడం జరిగింది అని తెలిపారు. క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా ఎప్పుడైనా రావచ్చు అని తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని పెరగకుండా ఆపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఆయన వివరించారు. డాక్టర్ చెప్పిన విధంగా చికిత్సలు తీసుకున్నట్లయితే రోగాన్ని అదుపు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. క్యాన్సర్ తో చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి పంపించిన తర్వాత వారికి ఉండడానికి చికిత్స తీసుకోవడానికి లేని వారికి పాలిటీకేర్లో చికిత్సలు అందించడం జరుగుతున్న తెలిపారు. 620 మందికి చికిత్స నిమిత్తం జరిగిందన్నారు. ఇందులో 274 మంది పురుషులు మిగతా వారి స్త్రీలు ఉన్నారని తెలిపారు. క్యాన్సర్కు 190 మందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. రొమ్ముకు సంబంధించిన వారికి కూడా 201 మందికి చికిత్స అందించడం జరిగిందన్నారు 53 మంది సర్వేకల్ క్యాన్సర్కు చికిత్స అందిం ఇస్తున్నామన్నారు. 260 మందికి వివిధ క్యాన్సర్ల వారికి చికిత్సలు అందించడం జరిగిందని తెలిపారు. డైరెక్టర్ ఆధ్వర్యంలో చికిత్సలు అందించడం జరిగిందని వారి సిబ్బంది కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. పొలిటి కేర్ రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు .ప్రజలు అందరి సహాయ సహకారాలు అందించడం వల్లనే క్యాన్సర్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరిగిందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు మొబైల్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఇప్పటివరకు పోలికేర్ క్లినిక్ లో చికిత్సలు పొందిన వారందరికీ ఆయన పేర్కొన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాత్రి మాట్లాడుతూ ఈ వార్డులో క్యాన్సర్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వారం క్యాన్సర్ స్పెషలిస్ట్ జక్కుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందని డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన, ఎన్ సి డి ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వెంకటేష్, శ్రీనివాస్ రమణ,
స్టాఫ్ నర్సులు సంధ్య సాత్విక ఫిజియోథెరపిస్ట్ సునీత సాయి తదితరులు ఉన్నారు.