విశ్రాంత డిజిపి మాలకొండయ్య దివంగత మాతృమూర్తికి ఘన నివాళులు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
*విశ్రాంత డిజిపి మాలకొండయ్య దివంగత మాతృమూర్తి కి ఘన నివాళులు*
ఈ నెల ఏడో తేదీన పరమపదించిన విశ్రాంత డిజిపి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు శ్రీ ఎం మాలకొండయ్య మాతృమూర్తి శ్రీమతి రుక్మిణమ్మ (92) పెద్ద ఖర్మ సందర్భంగా ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని 'రెయిన్ ట్రీ పార్క' క్లబ్ హౌస్ లో శనివారం సంస్మరణ సభ జరిగింది. అసోషియేషన్ నాయకులు, సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ రంగాల, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరై రుక్మిణమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించి మాలకొండయ్య కుటుంబాన్ని పరామర్శించారు.