Sports & Games

Breaking News

పత్తి అమ్మకాలకు కొనుగోలుపై ప్రత్యేక ఫిర్యాదు కేంద్రాల ఏర్పాటు - జిల్లా కలెక్టర్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్ : వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాదు వానాకాలం పత్తి మార్కెటింగ్ సీజన్ 2024 -25 జిల్లాలోని పత్తి కొనుగోళ్లలోని రైతుల సమస్యలు/ సందేహాలు/ ఫిర్యాదులకై వివిధ శాఖల సమన్వయంతో మల్టి డిసిప్లినరీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజర్షి షా శనివారం తెలిపారు. 

1) వ్యవసాయ శాఖ కార్యాలయ విస్తరణ అధికారి ప్రసాద్ మొబైల్ నంబర్ 9014208626, 

2) వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం-  జె. స్వామి (సహాయ మార్కెట్ పర్యవేక్షకులు)
  మొబైల్ నంబర్ 7893586672

3) సిసిఐ కార్యాలయ-  కె. ప్రవీణ్ (జూనియర్ అకౌంటెంట్) 
మొబైల్ నంబర్ 9010780973

4) లీగల్ మెట్రాలజీ- ఎల్.నవీన్ కుమార్ (టెక్నికల్ అసిస్టెంట్)
 మొబైల్ నంబర్ 8247767144

5) రవాణా శాఖ కార్యాలయ- జైవంత్ రాథోడ్ (సీనియర్ అసిస్టెంట్) 9177434577. 

ఈ నెంబర్లకు రైతులు సంప్రదించి తమ సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ నెల 23 న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆదిలాబాదు నందు ఉదయం 10 .00 గంటలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 

ఇందుకుగాను మార్కెట్ యార్డ్ లో ఆదిలాబాదు-ఏ, ఆదిలాబాదు-బి, సీసీఐ సెంటర్ల ప్రారంభం నకు  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 2024-25 సంవత్సరానికి గాను పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ.7521/- గా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. 

సీసీఐ తేమ 8 శాతం నుండి 12 శాతం వరకు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని, తేమ 12 శాతం కంటే ఎక్కువ ఉన్న పత్తిని సీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయదని, అందుకు రైతులు తమ పత్తిని ఇంటి వద్దనే ఆరబెట్టుకొని ఎండిన తరువాత తేమ 8 శాతం మించకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి మార్కెట్ యార్డ్ కు, సీసీఐ కొనుగోలు కేంద్రాలకు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్, మొబైల్ ఫోన్ (ఓటీపీ కొరకు) తమ వెంట తీసుకొని రావాలని అన్నారు.  

సిసిఐ పత్తి కొనుగోళ్లు ప్రతి రోజు అనగా పని దినాలలో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పని చేస్తాయని, సిసిఐ సాఫ్ట్ వెర్ కు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి కలదు కావున రైతులు మార్కెట్ యార్డ్, సిసిఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చే లోడ్ వాహనాలను మధ్యాహ్నం 2.00 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, తరవాత వచ్చే భర్తీ/ లోడ్ వాహనాలను మరుసటి రోజు అనుమతించడం జరుగుతుందని, ఇట్టి విషయాలను రైతులు గమనించి , రైతులు జిల్లా యంత్రాంగానికి, మార్కెట్ కమిటీ, సీసీఐ అధికారులకు పత్తి కొనుగోళ్లు సజావుగా నడుపుటకు సహకరించాలని, ఒకేసారి కాకుండా దశల వారీగా సీసీఐ కేంద్రాలకు రావాలని కోరారు.

ప్రస్తుత పత్తి సీజన్ 2024-25 సంవత్సరమునకు సంబందించి జిల్లాలో ఆదిలాబాదు మినహా ఇతర సిసిఐ కొనుగోలు కేంద్రాలు వచ్చే నెలలో ప్రారంభం అవుతాయని, వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మార్కేట్ కమిటి అదిలాబాద్l లో , సీసీఐ కొనుగోలు కేంద్రం అదిలాబాద్ A, B , నోటిఫై కాబడిన జిన్నింగ్ మిల్లుల సంఖ్య 
అదిలాబాద్ మార్కేట్ యార్డులోని పత్తి రైతుల వాహనాలను తూకం వేయబడును.

బోథ్ మార్కెట్ కమిటీ లో 
బోథ్ లో రాఘవేంద్ర సాయిదత్త, స్వప్న జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ .

పోచ్చెర లో  శ్రీ సాయిబాబా జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ.
సోనాలా లో సీసీఐ కేంద్రం శ్రీ గురుసాహెబ్ చందా కాటన్ ఇండస్ట్రీ .

నేరడిగొండ లో సీసీఐ కొనుగోలు కేంద్రం 
 శ్రీ దర్శన ఇండస్ట్రీస్.

ఇంద్రవెల్లి లో  మార్కేట్ కమిటి, సీసీఐ కొనుగోలు కేంద్రం 
   1.ఇంద్రవెల్లి ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ 
2. మిట్టల్ జిన్నింగ్ ఫ్యాక్టరీ 
3. విజయలక్ష్మీ కాటన్ ఇండస్ట్రీస్ .

నార్నూరు సీసీఐ కొనుగోలు కేంద్రం లో
   1  గజనంద్ శ్రీ జిన్నింగ్ మరియు.   
         ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ 
2. ఎన్ ఆర్ ఎన్ ఆర్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ లిమిటెడ్ .

ఇచ్చోడ మార్కెట్ కమిటీ, సీసీఐ కొనుగోలు కేంద్రం లో   
రాణి జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్, ఇండస్ట్రీస్.

గుడిహత్నూరు సీసీఐ కొనుగోలు కేంద్రం లో 
1.  రాణి కాటన్ మిల్స్,  
2.  శ్రీ లక్ష్మీ జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ 

జైనాధ్ మార్కెట్ కమిటీ లోని బేల సీసీఐ కొనుగోలు కేంద్రం మా ఆశపూర జిన్నింగ్ మిల్లు లో