Sports & Games

Breaking News

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి - కడప వన్ టౌన్ ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి

 ఎడిటర్ కె నరేష్ కుమార 9848025451


మానవ అక్రమ రవాణాను అరికట్టాలి.... కడప వన్ టౌన్ ఎస్ ఐ అమర్నాథ్ రెడ్డి .

ఆస్ట్రేలియా ఏ 21, ది మూమెంట్ ఇండియా, గ్రామ జ్యోతి సొసైటీ మదనపల్లి వారి సహకారంతో  మీకోసం స్వచ్ఛంద  సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు" వాక్ ఫర్ ఫ్రీడం" ర్యాలీ నీ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుండి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వన్ టౌన్ ఎస్ ఐ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49.6 మిలియన్ల మంది ప్రజల అవయవాల దోపిడి, లైంగిక దోపిడీకి గురి అవుతున్నారని, ప్రముఖంగా లైంగిక దోపిడీకి మహిళలు బాలికలు చిన్నారులే బలి అవుతున్నారు అని,అబ్బాయిలు బలవంతపు శ్రమ కొరకు వాడబడుతున్నారు అని,మానవ అక్రమ రవాణా లేని సమాజాన్ని మనం అందరూ చూడాలనుకుంటున్నాం అని తెలిపారు. అందరికీ అవగాహన కల్పిస్తూ అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తారని , అపహరణకు గురైన వారు హెల్ప్ లైన్ నెంబర్లు 100,1098,181 లను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని,ప్రజలు అప్రమత్తంగా ఉండి తనను తాను రక్షించుకోవాలని ,ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలని  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్టెల్లా షర్మిలా రాణి, మీకోసం  విష్ణు వర్ధన్, స్టెప్ మేనేజర్ సుబ్బారాయుడు, అబ్బాస్,నాగయ్య, ఎన్ వై కే వాలంటీర్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.