ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ వంశీకృష్ణ
.ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ వంశీకృష్ణ
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ మరియు ప్రధానమంత్రి జన్ మాన్ ప్రోగ్రాం అధికారిగా బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ ఏ వంశీకృష్ణ ను నియమిస్తూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. బెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రౌండ్ ది క్లాక్ (24 గంటల) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ వంశీకృష్ణను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తన పనితనాన్ని గుర్తించి నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం అధికారిగా, మరియు జన్ మాన్ ప్రోగ్రాం అధికారిగా నియమించారు. ఇప్పటినుంచి డాక్టర్ వంశీకృష్ణ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ తో పాటు జెన్ మాన్ కార్యక్రమాలను పర్యావిక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ తెలిపారు. బాధ్యతలను స్వీకరించిన డాక్టర్ వంశీకృష్ణను నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు స్వాగతం పలికి అభినందించారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అనిల్ కుమార్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆయన రాజీనామా చేశారు ఆయన స్థానంలో వేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణను నియమిస్తూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.