మదర్ తెరిసా పురస్కారానికి శిఖ సామ్సన్ ఎంపిక
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మదర్ తెరిసా జాతీయ సేవా పురస్కారానికి శిఖా శాంసన్ ఎంపిక
మదర్ తెరిసా జాతీయస్థాయి సాంఘిక సేవ పురస్కారానికి హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేబి బాబు తనను ఎంపిక చేసినట్లు వైద్య ఉద్యోగి అవార్డు గ్రహీత శిఖా శాంసన్ శనివారం పల్నాడు జిల్లా క్రోసూరులో తెలిపారు దశాబ్దాల కాలంగా వివిధ రంగాల్లో సేవ చేస్తున్న ప్రముఖులకు సామాజిక సేవకులకు హెల్ప్ ఫౌండేషన్ సంస్థ గుర్తించి వారి సేవలకు ప్రతిఫలముగా జాతీయస్థాయి పురస్కారాలు ఈ నెల 20వ తేదీ ఆదివారం సత్తనపల్లి ఐఏఎం హాల్ నందు ప్రధానం చేయనున్నట్లు హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.వి బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ తన దేశం కానీ దేశానికి వచ్చి భారతదేశాన్ని మాతృదేశంగా భావించి తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం ఇచ్చి దేశానికి విలువైన సేవ వైద్య పరంగా, విద్యాపరంగా సేవలందించిన విశ్వమాత మహనీయురాలు మదర్ తెరిసా పేరు మీద విశిష్ట సేవ పురస్కారానికి నన్ను ఎన్నుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శాంసన్ కు శ్రేయోభిలాషులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు