Sports & Games

Breaking News

తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు.. జీరో వన్ జీరో వేతనాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉందని అంతేకాకుండా జీరో వన్ జీరో వేతనలక్కై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహను మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ తిన్నావా అజయ్ కుమార్ కుల ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ జేఏసీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్ కన్వీనర్ పండు ల ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ లకు పలు సమస్యలు ఉద్యోగులు వివరించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రుల సమస్యలను పరికరాలు తోపాటు తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకుగాను మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా వారికి మంత్రి ఆమె ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలను పరిష్కరించే దిశగా ముందు అడుగు వేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే మొదటి సంతకాన్ని స్టాఫ్ నర్స్ భర్తీ పై పెట్టడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ టూటర్ పోస్ట్లను భర్తీ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కొత్తగా ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్ లో పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగిందని తొందరలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. సమస్యలు ఉన్నాయని విడుదలవారీగా సంవత్సరం పరిష్కరిస్తామని తెలిపారు పేద ప్రజలకు వైద్య సేవలు అందించటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలోమరియమ్మ , సత్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి ,శైలజ, క్రిస్టఫర్ ,డేవిడ్, యూనస్, నరసింహారెడ్డి, పరబ్ కుమార్, బైరపాక శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,సంధ్య , దుర్గం శ్రీనివాస్, రఫిక్ , అరుణ్ , పాల్గొన్నారు.