Sports & Games

Breaking News

ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీని అంగీకరించేది లేదు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించకుండ, కాలయాపన కోసం వేసిన కమిటీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర అధ్యక్షులు ఎండి పసియుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. యాద నాయక్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు,ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద  ఐదు డి ఏలు పెండింగ్ లో ఉన్నాయని,ఈ ఐదు  డీఏలు కలిపి 17.28 శాతం రావాల్సి ఉందని అన్నారు, అదేవిధంగా 2023 జూలై 1 నుండి రావలసిన పిఆర్సిని వెంటనే ప్రకటించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఉద్యోగులకు న్యాయంగా రావలసిన అన్ని రకాల బిల్లులు నెలల తరబడి ఈ కుబేర్ లలో మూలుగుతున్నాయని వాటిని వెంటనే ఉద్యోగుల ఖాతాలలో జమ చేయాలని, ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా  జీవో 317ను రద్దు చేయాలని,ఉద్యోగులు కోరుకున్న విదంగా బదిలీలు చేయాలని,సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని,కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అన్ని అంశాలపై స్పందించకపోతే  తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్,కార్మిక, ప్రజాసంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.