Sports & Games

Breaking News

రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు అవసరం. - రొమ్ము క్యాన్సర్ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్యజ్యోతి): రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ ,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ లు అన్నారు. రొమ్ము క్యాన్సర్ పై రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ నుండి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. మహిళలు కు స్థానాలలో కనుతులు ఏర్పడతాయని అవి ఏర్పడిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ అనేక రకంగా కారణాలు ఉన్నట్టు వారు వివరించారు. వంశపార్యంపర్యంగా వచ్చే అవకాశం ఉందని దీనితో పాటు అనేక రకాల కారణాలు ఉన్నట్లు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడం వాటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయని పేర్కొన్నారు తనాలలో గుంట ఏర్పడటం సనం ఆకారంలో మార్పు రావడం తన చుట్టూ నొప్పి తో పాటు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయని ఆ లక్షణాలు కల్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల డెబ్బై వేలమంది 2022లో రొమ్ము క్యాన్సర్ కారణంతో మరణించినట్లు తెలిపారు. ఇదే ఏడాది 2.3 మిలియన్ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది అని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ ను ముందుగా గుర్తించినట్లయితే క్యాన్సర్ పెరగకుండా నిరోధించే దానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గమనించినట్లయితే కీమోథెరపీ ద్వారా వ్యాధిని అదుపు చేయవచ్చని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్ మరణాలను 2.5% తగ్గించడం లక్ష్యంగా ఆరోగ్య సంస్థ పెట్టుకుందని తెలిపారు ఇందులో భాగంగా 2020 మరియు 2040 మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ మరణాలను 2.5% తగ్గించాలని లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, వైద్యులు డాక్టర్ శిరీస్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ విద్య విల్సన్ , డాక్టర్ సింధుజా ,డాక్టర్ జక్కుల శ్రీకాంత్, డాక్టర్ దీపక్ పుష్కర్, అశ్విన్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు