Sports & Games

Breaking News

ఘనంగా ధన్వంతరి జయంతి

. ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

- రిమ్స్ గణేష్ ఆలయంలో ఆయుర్వేద వైద్య శిబిరం 
- ధన్వంతరి కి ప్రత్యేక పూజలు 
- పాల్గొన్న ఆయుర్వేద వైద్యులు 
ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయుర్వేద వైద్యులు అందరు కలిసి ధనవంతురి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రిమ్స్ ఆవరణలో గల గణేష్ ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధనవంత్రి కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిమ్స్ గణేష్ టెంపుల్ తో పాటు ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ పాఠశాలలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. సుమారు 350 కి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచిత మందులను పంపిణీ చేశారు. ఆయుర్వేద వైద్యం అనేది అనాధిగా వస్తుందని తెలిపారు. ధన్వంతరి జయంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ధనవంతరి జయంతి సందర్భంగా ప్రత్యేక ఆయుర్వేద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. ముందుగా ధనవంత్రి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో రకరకాల రోగాలకు వైద్య సేవలు అందించడం జరిగిందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాథోడ్ ప్రీతల్, వైద్యులు డాక్టర్ వాణి , డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నర్మదా, డాక్టర్ అనిత, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ పూనం, యునాని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫరీదా బేగం, సంజీవ్, మహేందర్, సుమన, మంత్, జయ బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.