తెలంగాణలో 13 మంది డిఎం అండ్ హెచ్ వో లు వీరే
. ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- 13 జిల్లాలకు ఇన్చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నియామకం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోస్టులను భర్తీ చేసేందుకు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వం నియమించింది. 13 జిల్లాల్లో డిఎం అండ్ హెచ్ ఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆస్థానంలో ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వం నియమించింది ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్, జనగాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ మల్లికార్జున రావు, జోగులాంబ గద్వాల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ సిద్ధప్ప, ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ బానోత్ కళావతి , ఆసిఫాబాద్ కుమార బీమ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే సీతారాం, మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ మురళీధర్, మహబూబ్నగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కృష్ణ ను ప్రభుత్వ నియమించింది. ములుగు వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ గోపాలరావు, పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సిద్దిపేట వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పవన్ కుమార్ నో ప్రభుత్వం నియమించింది. అలాగే వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ వై వీణకంట రావన్ నియమించింది. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఏ శ్రీనివాసులు, యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఎం మనోహర్ గా ప్రభుత్వం ఇంచార్జ్ వైద్యాధికారి లుగా నియమించింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 13 జిల్లాల్లో రెగ్యులర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు లేకపోవడంతో 13 మంది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది.