మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయం ప్రారంభం
ఎడిటర్ కి నరేష్ కుమార్ 9848025451
మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయం
మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ రెండో లైన్ నందు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి జ్ఞాపకార్ధంగా అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు గారి చేతుల మీదుగా నూతన గ్రంథాలయం ప్రారంభించడం జరిగింది అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు గారు మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ గారి సేవలను ఆదర్శంగా తీసుకొని మేము సైతం సభ్యులు గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని చెప్పడం జరిగింది సూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మేము సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో 750 రకముల పుస్తకములు మరియు స్పోర్ట్స్ కిట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఒంగోలులోని నివాసులందరూ ఈ గ్రంథాలయ సౌకర్యములను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ యూత్ ఆఫీసర్ కమల్ సా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయాశీలరావు, కొప్పోలు మాజీ సర్పంచ్ రఘు, 38వ డివిజన్ జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, వడ్డంపూడి సుజాత, జె సి ఐ ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు, సూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ భాష, మేము సైతం సభ్యులు తదితరులు పాల్గొన్నారు