డిజిటల్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- జిల్లా కలెక్టర్ రాజార్షి షా
అదిలాబాద్: డిజిటల్ పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. అదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11 మరియు 12వ వార్డులలో నిర్వహిస్తున్న సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకై పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 11 12 వార్డులో తో పాటు అన్ని వాళ్లలో సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి కుటుంబం నీకు సంబంధించిన అన్ని వివరాలు తప్పులు లేకుండా ఫార్మేట్లో పూర్తిచేయాలని తెలిపారు ఇంటి యజమాని గా మహిళా పేరు ఉండాలని తెలిపారు తదుపరి కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయాలని దీనితోపాటు మొబైల్ ఫోన్లో ఫోటోలు కూడా తీసుకోవాలని తెలిపారు.రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు అలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.- అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. డిజిటల్ కార్డు కోసం నిర్వహించే సర్వే 3 నుంచి 7 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా సర్వే కొనసాగుతుందన్నారు.కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందులో అవసరమైన మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ఎమ్మార్వోలు
శ్రీనివాస్, వేణు, వార్డ్ కౌన్సిలర్ షానవాజ్ ఉర్ రెహమాన్, ఏలేటి భీమ్ సేన్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ కమల, ధనలక్ష్మి మంజుల, సందీప్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.