మహిళల రక్షణ పై అవగాహన సదస్సు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 8748025451
ములుగు (ఆరోగ్యజ్యోతి): మహిళలను రక్షించడం కోసం తనను తాను ఎలా రక్షించాలి అనే అంశంపై జిల్లా హాస్పిటల్ లో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో మహిళా డాక్టర్లు మహిళా సిబ్బంది కి సెమినార్ ఈ సెమినార్లో మహిళలు తనను తాను ఎలా రక్షించుకోవాలి అనే విషయంపై అనే అంశంపై వైద్య మహిళా ఉద్యోగులకు మహిళా డాక్టర్లు డాక్టర్ సుష్మిత డాక్టర్ లిఖిత, డాక్టర్ రాధిక పలువురు మహిళా డాక్టర్లు మహిళలపై జరుగుతున్న అవాంచి త ఘటనలపై చట్టాలపై అవగాహన కల్పించారు.మహిళలు ఒక చోట నుండి వేరొక చోటికి వెళ్లేటప్పుడు వారు ఎలా సేఫ్టీ గా ఉండాలని విషయంపై పలువురు డాక్టర్లు వివిధ రక్షణలను, రక్షణ కోసం హ్యాండ్ బ్యాగులల్లో ముందస్తు ప్లాన్ గా పెప్పర్ స్ప్రే, సేఫ్టీ పిన్స్, గట్టిగా అరవడం, మొదలైన రక్షణ సామాగ్రులను మనం వెళ్లే దారిలో ఏమన్నా అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే వన్ హండ్రెడ్ కు కాల్ చేయాలని, సెల్ఫోన్లో సేఫ్టీగా లోకేషన్, ఏర్పాటు చేసుకోవాలని మనం ఎలా రక్షించబడునోఅనే అంశాలను అలవర్చుకోవాలని అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళ గాని మన చుట్టుపక్కల వాళ్ళ గాని మనకు తెలిసిన అవగాహనను తెలియజేయాలని వారు మహిళలు, మహిళ వైద్య ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించినారు, ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్ మాట్లాడుతూ మన దగ్గర ఉన్న ఆయుధాలను ఆయుదంగా మార్చకుండా ఏ టైం అప్పుడు ఇలా చేయాలో చాలా తెలివిగా డీల్ చేయాలని వారన్నారు, హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ఒక చోట నుండి మరొక చోటికి మహిళలు వెళ్లినప్పుడు మనం పోయే దారి ఎటు ఈ వాహనంలో వెళ్తున్నప్పుడు వీరేటు వెళ్తున్నారని గమనించి మన మెదడుకు పని చెప్పాలి గాని రక్షణ పరికరాలు ఉన్నాయని ఆలోచనతో కాకుండా మనం వెళ్లే గమ్యాన్ని గమనిస్తూ ముందుకు వెళ్లాలని, మాకెందుకు అనుకోవడం కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చునని, అందరూ ఒకే లాగా ఉన్నారని కోవడం కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది గానీ,మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు అతను పోయే దారిలో మనిషి యొక్క మాట్లాడే తీరు అతని స్వభావం ఎలా ఉంటుందని మనం ముందే పసిగట్టి ఇలాంటి కొన్ని సేఫ్టీ ట్రిక్స్ వాడడం వల్ల కొంతవరకు మేలు జరుగుతుందని ఆయుధం ఉంది కదా అనే భ్రమలో ఉండకుండా మన మెదడు కూడా పని చెప్పాలని అట్లాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకు ఫిజికల్ గా కొన్ని కరాటే కొన్ని ఫిజికల్ గా నేర్పించేది కూడా నేర్పించాలని లేక ఏదైనా సంఘటన జరిగితే వాళ్లను భయపెట్టే విధంగా కాకుండా మంచి మార్గంలో ఉండే సూచనలు ఆ అక్క ఆ చెల్లి ఆ తల్లి ఇలా చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా సురక్షితంగా తప్పించుకున్నారని చెప్పవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు దారివెంటఁ ఒకరు వెళ్తున్నప్పుడు మనల్ని వెంబడించే వ్యక్తి యొక్క నడకను మనం గమనిస్తూనే మన యొక్క ప్రయాణం సాగే విధంగా ఉండాలి గాని సెల్ఫోన్లో మాట్లాడుతూ ఏదో విషయాలను ఆలోచిస్తూ దారి వెంట నడవకూడదని కొన్ని కొన్ని సందర్భాలలో మనం గమ్యం చేరే దిశగా సురక్షితంగా చేరాలి అనుకోవాలి ఏదైనా అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఇలాంటి సేఫ్టీలు ఉపయోగించి మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనకు మనమే రక్షించుకోవాలని వారు పలువురు మహిళా ఉద్యోగులకు సూచనలు చేసినారు, అనంతరం డాక్టర్ సుష్మిత మహిళ వైద్య ఉద్యోగులందరికీ హ్యాండ్ బ్యాగ్ లో వీలుగా ఉంచుకునేందుకు పెప్పర్స్ స్ప్రే, సేఫ్టీ కిట్ ప్రజెంట్ చేసినారు, ఈ కార్యక్రమంలో హాస్పటల్ RMO డాక్టర్ ప్రవీణ్ రెడ్డి , నర్సింగ్ సూపర్ డెంట్ ఎడ్ నర్సులు, నర్సింగ్ ఆఫీసర్స్ పారామెడికల్ సిబ్బంది శాంని టే షన్ ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరూ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.