Sports & Games

Breaking News

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పని భారం తగ్గించి రెగ్యులర్ చేయాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

*ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు ఉద్యోగులకు ఎన్నాళ్ళీ శ్రమదోపిడి* 

 *పనికి తగ్గ జీతం వచ్చేవరకు పోరాడుదాం* 

 *ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ పిలుపు* 

*ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*


 గ్రామీణ స్థాయిలో పేదలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్  లో పనిచేయుచున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పనికి తగిన జీతం ఇవ్వకుండా శ్రమదోపిడికి గురిచేయుచున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ విమర్శించారు.
 నేడు కోటి లోని ఎన్ హెచ్ ఎం కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల క్యాడర్ల ఉద్యోగులతో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది.
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎన్ హెచ్ ఎం స్కీములో వివిధ క్యాడర్లుగా పని చేయుచున్నటువంటి ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ గైడ్లైన్స్ ప్రకారం కానీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చట్టం ఉన్నప్పటికీ గారిని అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.
 రాష్ట్రంలో కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానం తీసుకువచ్చిన సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించే పద్ధతి ఉన్నదని కానీ గత పది సంవత్సరాలుగా ఆ విధానాలకు తిరోధకాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం తక్కువ జీతాలతో ఉద్యోగులతో పనులు నిర్వహించుకుంటున్నదని ఈ విషయంపై గతంలో అనేక సందర్భాలలో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కి తెలియజేసిన సమస్య పరిష్కారం కానందుకు నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు వివరించారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయుచున్నటువంటి ఉద్యోగులకు అనారోగ్యం బారిన పడితే ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నదని, 35 క్యాజువల్ లీవులు మరియు  వేతనంతో కూడిన మేటర్నిటీ లీవులు కానీ అమలు కావటం లేదని వారు తెలియజేశారు.
 కాంట్రాక్టు ఉద్యోగులందరికీ 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లాంటి సౌకర్యాలు కల్పించే వరకు పోరాటం నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
 *ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా* మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పిఆర్సి సందర్భంగా ఇవ్వవలసిన ఏడు నెలల ఏరియాస్ బకాయిలకై నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్న నేటికి కూడా విడుదల చేయకపోవడం అన్యాయమని వారు విమర్శించారు.
 నిత్యం ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన యాపుల ద్వారా ఆన్లైన్, నిర్వహిస్తున్నామని, ఉద్యోగులకు అవసరమైన సెల్ ఫోన్ గాని నెట్ సౌకర్యం కానీ అధికారులు కల్పించడం లేదని, సౌకర్యాలు కల్పించకుండా విధులు నిర్వహించాలని అడగటం అన్యాయమని వారు తెలియజేశారు.
 గత పది సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఐదు శాతం ఇన్సెంటివ్ కూడా ఉద్యోగులకు ఇవ్వడం లేదని, రోజురోజుకు పని ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ ఉద్యోగుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు అధికారులకు ఆలోచన లేకపోవడం అన్యాయమని వారు విమర్శించారు.
 ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్  రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం , రాష్ట్ర ఉపాధ్యక్షులు సరికొండ సురేష్ గౌడ్ , సిద్దిపేట రాజేశ్వరి రెడ్డి, ఆచంట అభిషేక్ ,ప్రవీణ్, శ్రీనివాస్,  రెండవ ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల, కోశాధికారి పద్మ, జ్యోతి, డి కరుణ, కోర్నల్,  కృష్ణవేణి, కరుణ, చందు,  తిరుమలేష్,  లక్ష్మి, వెన్న మహేష్,  శ్రీనివాస్, భారతి,  తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఈఓ కృష్ణవేణి కి అందజేయడం జరిగింది....