Sports & Games

Breaking News

బయో కెమిస్ట్రీ ల్యాబ్ లో పూజలు

. ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో గల బయో మెడికల్ ల్యాబ్ లో దుర్గా నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అశోక్, నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ జయ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ బయో కెమిస్ట్రీ ల్యాబ్ లో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం అనవయతిగా వస్తుందని తెలిపారు. గత సంవత్సరం కూడా దుర్గా పూజ నిర్వహించడం జరిగిందని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ కిషోర్, ట్యూటర్ డాక్టర్ స్వామి, బయో కెమిస్ట్ అనిల్, అశ్విన్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు మహేష్, నగేష్, సుజాత, గజానంద్, మహేందర్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు