Sports & Games

Breaking News

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలి -జిల్లా కలెక్టర్ రాజార్షి షా


 అదిలాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కై పైలెట్ ప్రాజెక్టుగా  నిర్వహించిన సర్వే ఆన్ లైన్ లో తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలనీ జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు బుదవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా తన ఛాంబర్ లో  ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఫార్మట్ లో  పూరించిన ప్రకారం తప్పులు లేకుండా ఆన్ లైన్ డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు .పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన ఏజెన్సీ లలో అదిలాబాద్ రూరల్ లోహారా,  గుడిహత్నూర్ మండలం లో గోండు హార్కా పూర్, ఇచ్చోడ మండలం లోని ఆడేగాం బి,  మునిసిపాలిటీ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ల జారీ కై పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా   నిర్వహించిన ఇంటింటి  సర్వే లో సర్వే వివరాలు, ఫొటో గ్రఫీ , ఆన్ లైన్ లో డేటా ఎంట్రీ, ఫ్యామిలీ ఫోటో అప్ లోడ్,తదితర వాటి పై సమీక్షించి, ఆన్ లైన్ డేటా ఎంట్రీ తప్పులు లేకుండా గడువు లోగా పూర్తి చేయాలని ఆన్నారు.ఈ సమావేశం లో zp CEO, మున్సిపల్ కమిషనర్, EDM, dlpo తదితరులు ఉన్నారు.