మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి
- తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ పాలనలో దేశ అభ్యున్నతి, ఆమె చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయమని అన్నారు. నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి గా ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్ములన, బ్యాంకుల జాతీయకరణ వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి, వ్యవహారపరంగా ఎలా ఉండాలనేదానికి ఇందిరా గాంధీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి కిసాన్ కాంగ్రెస్ పక్షాన, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, కో -ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, మావల మండల్ యూత్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్,సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, కొరటి ప్రభాకర్, రంజిత్ రెడ్డి, కృష్ణ, సాగర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.