ఘనంగా సర్దార్ వల్లభాయ్ జన్మదిన వేడుకలు
.సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన శ్రీకాంత్ రెడ్డి
దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, హోమ్ మంత్రి వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ , బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో ఆయన విలీనం చేయడం జరిగిందని గుర్తుచేశారు. దేశ ప్రజలను ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని వారి ఆశయ సాధనకోసం ప్రతీ ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, కో -ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, మావల మండల్ యూత్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్,సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, కొరటి ప్రభాకర్, రంజిత్ రెడ్డి, కృష్ణ, సాగర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.