NHM ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో,(ఆరోగ్య జ్యోతి):తెలంగాణ ఎన్ హెచ్ ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ 1271 పోస్టులతో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నోటిఫికేషన్ లో చాలా అవక తోకలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేటేజ్ ఇవ్వడంపై ఖచ్చితమైన క్లారిటీ లేదు. ఏజెన్సీల ద్వారా ఇష్టానుసారంగా సర్వీస్ సర్టిఫికెట్స్ ఉద్యోగులు తెచ్చుకుంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వం అధికారుల వద్ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తారు, ఇలా ఏజెన్సీల ద్వారా తేవడం వల్ల గత 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులము చాలా నష్టపోతామని వాపోయారు, మరొక విషయం గత ప్రభుత్వం ANM కు సంబంధించిన నోటిఫికేషన్ లో వెయిటేజ్ మార్కులు 30 మార్కులు ఇవ్వగా దానికి సమాన క్యాడర్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్లు మాత్రం 20 మార్కులు వేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అధికారులు నోటిఫికేషన్లు పరిశీలించి వెయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ ఏం చేశారు. లేదంటే నోటిఫికేషన్ పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం జరిగినది.